Sujana Chowdary: రెండేళ్ల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నాను: సుజనా చౌదరి

  • ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పిన సుజనా
  • బీజేపీలో చేరిక
  • చంద్రబాబే పంపారనడంలో నిజంలేదని స్పష్టీకరణ

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించామని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు తనకు నచ్చలేదని అన్నారు. 2017లో రాజకీయాలకు గుడ్ బై చెబుదామని నిర్ణయించుకున్నానని, కానీ పార్టీ నష్టపోతుందని చెప్పడంతో విరమించుకున్నానని తెలిపారు. ఇటీవలి ఎన్నికలు జరిగిన వెంటనే బీజేపీలో చేరితే సరిపోయేదని, ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని ఓ వ్యక్తి ఇచ్చిన సలహాతో మళ్లీ వెనక్కి తగ్గానని వివరించారు. తాను బీజేపీలోకే వెళ్లడానికి కారణం అరుణ్ జైట్లీ అని, ఆయన ఆహ్వానం మేరకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నానని సుజనా వెల్లడించారు. చంద్రబాబే తనను బీజేపీలోకి పంపారని చెప్పడం నిజం కాదని అన్నారు.

Sujana Chowdary
Andhra Pradesh
Telugudesam
BJP
Arun Jaitly
Chandrababu
  • Loading...

More Telugu News