N.T. Rama Rao: ఎన్టీ రామారావుగారితో సినిమా చేయలేకపోవడమే దురదృష్టం: కోదండరామిరెడ్డి

  • అక్కినేనితో 6 సినిమాలు చేశాను 
  • ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసే ఛాన్స్ వదులుకున్నాను
  • అప్పుడలా ఆలోచించలేదన్న కోదండరామిరెడ్డి

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్టీ రామారావును గురించి ప్రస్తావించారు. "అక్కినేని నాగేశ్వరరావుగారు కథానాయకుడిగా 6 సినిమాలు చేశాను. అయితే ఎన్టీ రామారావుగారితో సినిమా చేయలేకపోయాను. ఆయన పిలిచి మరీ అవకాశం ఇచ్చారు కూడా.

తమిళంలో శివాజీ గణేశన్ చేసిన ఒక సినిమాను తెలుగులో చేయమన్నారు. అయితే తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథను మార్చడానికి చాలా సమయం పడుతుందని చెప్పాను. అందువలన ఆ ప్రాజెక్టు పక్కకి పోయింది. ఆ తరువాత మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో బిజీగా ఉండటం వలన చేయలేకపోయాను. ఎన్టీ రామారావుగారితో సినిమా చేస్తే అదో రికార్డుగా వుంటుందనే ఆలోచన కూడా అప్పుడు నాకు రాకపోవడం బాధను కలిగిస్తుంది. ఆయనతో సినిమా చేయలేకపోవడం నిజంగా దురదృష్టమే" అని చెప్పుకొచ్చారు.

N.T. Rama Rao
Kodandarami Reddy
  • Loading...

More Telugu News