Capital: టీడీపీ హయాంలో ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలన్న మోసం జరిగింది: ధర్మాన ప్రసాదరావు

  • ఏపీకి సరైన రాజధాని లేకుండా పోయింది
  • శివరామకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయలేదు?
  • అమరావతిలో ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని గందరగోళం

రాజధాని అమరావతి అంశంపై ఏపీ అసెంబ్లీలో ఈరోజు వాడివేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ఏపీకి సరైన రాజధాని లేకుండా పోయిందని, నాడు శివరామకృష్ణ కమిటీ నివేదికను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆనాడు కొత్త రాజధానిపై సరైన నిర్ణయం తీసుకోలేదని, ఉమ్మడి రాజధానిని వదిలి వచ్చేశారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమరావతిలో ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని గందరగోళం నెలకొందని విమర్శించారు.

టీడీపీ హయాంలో కేవలం, ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలన్న మోసం జరిగిందని, వెనుకబడిన శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాలను వదిలేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాలకు పెద్ద ప్రాజెక్టులు ఒక్కటైనా ఇచ్చారా? ఏ ఒక్క సంస్థ పెట్టడానికి కూడా శ్రీకాకుళానికి అర్హత లేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వేలకు వేల ఎకరాలు తీసుకొని రైతుల నోట్లో మట్టి కొట్టిందని, కేవలం ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఏం సాధించాలనుకున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి, పరిపాలన ఒకే చోట కేంద్రీకృతం కాకూడదని అన్నారు.

  • Loading...

More Telugu News