Mohan Babu: విద్యార్థి లోకంపై పోలీసు చర్య నన్ను కలచివేసింది: మోహన్ బాబు

  • పౌరసత్వం చట్టం కారణంగా నిరసన జ్వాలలు
  • ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య
  • ఖండించిన మోహన్ బాబు

పౌరసత్వ చట్టానికి కొత్తరూపు కల్పిస్తూ కేంద్రం సవరణ చేయడం పట్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధానిలోని కొన్ని వర్శిటీల్లో నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. పోలీసులు వర్శిటీ హాస్టల్ లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీచార్జి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు స్పందించారు.

 ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడికి దిగడం తనను కలచివేసిందని తెలిపారు. తాను హింసను ప్రోత్సహించనని, ఏ విధమైన హింసకు పాల్పడవద్దని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నానని ట్వీట్ చేశారు. అంతేకాకుండా, పోలీసులకు కూడా ఈ సందర్భంగా సూచన చేశారు. 'మైడియర్ పోలీస్, విద్యార్థులే మన దేశ భవిష్యత్తు, వారిని గౌరవించండి' అంటూ పేర్కొన్నారు.

Mohan Babu
NDA
CAA
New Delhi
Students
Police
  • Loading...

More Telugu News