Gender Gap Index: లింగ భేద సూచీలో భారత్ కు 112వ స్థానం

  • 2019 వరల్డ్ ఎకనమిక్ ఫోరం జెండర్ గ్యాప్ ఇండెక్స్ విడుదల
  • మెరుగైన స్థానాల్లో బంగ్లాదేశ్, చైనా, నేపాల్
  • చివరి నుంచి మూడో స్థానంలో పాకిస్థాన్

లింగ భేద సూచిలో గత ఏడాదితో పోలిస్తే భారత్ నాలుగు స్థానాలు దిగజారి 112వ స్థానానికి చేరింది. గత ఏడాది భారత్ 108వ స్థానంలో ఉంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం తాజాగా 2019వ సంవత్సరానికి గాను జెండర్ గ్యాప్ ఇండెక్స్(లింగ భేద సూచీ)ను విడుదల చేసింది. ప్రొఫెషనల్ ఉద్యోగాలు, సీనియర్ స్థాయి పదవుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించాల్సిన ఆవశ్యకత ఉందని నివేదిక పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనేందుకున్న అవకాశాలు, విద్య, రాజకీయ సాధికారిత, ఆరోగ్యం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సూచీని వరల్డ్ ఎకనమిక్ ఫోరం రూపొందించింది.

ప్రపంచంలో లింగ భేద సమస్య తొలగిపోవడానికి మరో 99.5 సంవత్సరాలు పడుతుందని నివేదిక పేర్కొంది.  ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగడం లింగభేదం తగ్గడానికి కారణమని తెలిపింది. రాజకీయ రంగంలో పురుషులు, మహిళల మధ్య అంతరం తొలగిపోవడానికి 95 ఏళ్లు పట్టే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. కాగా,  లింగ భేద సూచీలో ఐస్ లాండ్ అగ్ర స్థానంలో నిలవగా పొరుగుదేశాలైన చైనా 106, నేపాల్ 101, బంగ్లాదేశ్ 50వ స్థానాలతో మన కంటే ముందున్నాయి. చివరి స్థానం 153వ ర్యాంక్ లో యెమెన్ ఉండగా, పాకిస్థాన్ చివరి నుంచి మూడో ర్యాంకులో ఉంది.

Gender Gap Index
India at 112
last Year India ranked 108
  • Loading...

More Telugu News