Narendra Modi: దేశం తగలబడుతుంటే... దుస్తుల గురించి వారు మాట్లాడుతున్నారు: మోదీపై దీదీ ఫైర్

  • కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అశాంతిని రాజేస్తున్నాయన్న మోదీ
  • దహనాలకు పాల్పడుతున్న వారిని దుస్తులను బట్టి గుర్తించవచ్చని వ్యాఖ్య
  • నా దుస్తులను చూసి నేనెలాంటిదాన్నో చెప్పగలరా? అని ప్రశ్నించిన దీదీ

ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఝార్ఖండ్ లో ఇటీవల నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, గృహదహనాలకు పాల్పడే వ్యక్తులను వారు ధరించే దుస్తులను బట్టి గుర్తించవచ్చని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై మమత స్పందిస్తూ... దేశం మొత్తం తగలబడుతుంటే, వారు మాత్రం మీరు వేసుకుంటున్న దుస్తుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను వేసుకున్న దుస్తులను చూసి తాను ఎలాంటి వ్యక్తినో మీరు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

ఆదివారం ఓ సభలో మోదీ ప్రసంగిస్తూ, 'కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు అశాంతిని పెంచిపోషిస్తున్నాయి. అనుకున్నది సాధించలేకపోతుండటంతో వారు గృహ దహనాలకు కూడా పాల్పడుతున్నారు. కొందరు నిప్పంటిస్తున్న దృశ్యాలను టీవీల్లో కూడా చూశాం. వారు వేసుకున్న దుస్తులను బట్టి వారు ఎవరో గుర్తించవచ్చు' అని వ్యాఖ్యానించారు.

Narendra Modi
Mamata Banerjee
BJP
TMC
  • Loading...

More Telugu News