IPL: ఐపీఎల్ ఆటగాళ్ల వేలంపై సందేహాలొద్దంటున్న బీసీసీఐ!

  • ఈ నెల 19న ఐపీఎల్ వేలం
  • కోల్ కతా వేదిక అని ప్రకటించిన బీసీసీఐ
  • పౌరసత్వ చట్టంపై నిరసనలతో బెంగాల్ లో ఉద్రిక్తతలు
  • పరిస్థితులను గమనిస్తున్నామన్న బీసీసీఐ

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ కోసం డిసెంబరు 19న ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈసారి వేలంలో 332 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలం ప్రక్రియకు కోల్ కతా వేదికగా నిలుస్తోంది. అయితే, పౌరసత్వ చట్టంపై ఆందోళనల కారణంగా బెంగాల్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో కోల్ కతాలో వేలం నిర్వహించడంపై క్రికెట్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. ఐపీఎల్ వేలం షెడ్యూల్ లో ఎలాంటి మార్పులేదని, ముందు నిర్ణయించిన ప్రకారమే గురువారం ఆటగాళ్ల వేలం ఉంటుందని ఓ అధికారి స్పష్టం చేశారు. కోల్ కతాలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.

IPL
Kolkata
Players
Auction
West Bengal
  • Loading...

More Telugu News