Kodanda Rami Reddy: 93 చిత్రాల్లో 80 సూపర్ హిట్ అయ్యాయి: దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి

  • 93 చిత్రాలను తెరకెక్కించాను 
  • భగవంతుడి ఆశీస్సులు వున్నాయి 
  • ప్రేక్షకుల ఆదరణ మరిచిపోలేనిదన్న కోదండరామిరెడ్డి

తెలుగు తెరకి ఎన్నో విభిన్నమైన కథలను పరిచయం చేసిన దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి. ఎంతోమంది స్టార్ హీరోలకు ఆయన భారీ విజయాలను అందించారు. మరెంతోమంది కథానాయికల కెరియర్ గ్రాఫ్ ను అమాంతంగా పెంచారు. అలాంటి ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

"నా కెరియర్లో 93 చిత్రాలను తెరకెక్కించాను. వాటిలో 80 చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. భగవంతుడి ఆశీస్సులు .. ప్రేక్షకుల ఆదరణ .. నాతో కలిసి పనిచేసిన వాళ్లు అందించిన సహకారం వలన, నేను ఈ స్థాయిలో విజయాలను అందుకోవడానికి కారణమని భావిస్తున్నాను. ఇన్ని విజయాలను అందించినందుకు ఆనందంగాను .. గర్వంగాను వుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.

Kodanda Rami Reddy
  • Loading...

More Telugu News