Bollywood: ‘తానాజీ’ నుంచి సెకండ్ ట్రైలర్ విడుదల

  • బాలీవుడ్ చిత్రం తానాజీ: ది అన్ సంగ్ వారియర్’
  • ‘మొఘల్ సామ్రాజ్యాన్ని..’ అంటూ ట్రైలర్ ప్రారంభం
  • జనవరి 10న విడుదల కానున్న ‘తానాజీ’

మరాఠా యోథుడు ఛత్రపతి శివాజీ సేనకు సైన్యాధిపతి తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం తానాజీ: ది అన్ సంగ్ వారియర్’ నుంచి రెండో ట్రైలర్ ఈరోజు విడుదలైంది. తానాజీ పాత్రలో అజయ్ దేవగణ్, ఆయన భార్య సావిత్రి పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. ‘మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన మెరుపుదాడులు..’ అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ లో యుద్ధ సన్నివేశాలు, నటీనటుల డైలాగ్స్, సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నారు.

Bollywood
Tanaji
movie
Ajaydevgan
kajol
  • Error fetching data: Network response was not ok

More Telugu News