NEFT: ఇక రోజులో ఎప్పుడైనా 'నెఫ్ట్' ద్వారా నగదు బదిలీ!

  • 24×7 నెఫ్ట్ లావాదేవీలకు రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం
  • గతంలో పగటివేళల్లోనే నగదు బదిలీ
  • బ్యాంకులు అధిక రుసుం వసూలు చేయబోవన్న రిజర్వ్ బ్యాంక్

గతంలో 'నెఫ్ట్' (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్) విధానం ద్వారా నగదు బదిలీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్యలోనే చేసుకునే వీలుండేది. ఇప్పుడా సౌలభ్యాన్ని 24×7కి పెంచారు. రోజులో ఎప్పుడైనా 'నెఫ్ట్' ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.

అంతేకాదు, ఏదైనా బ్యాంకుకు సెలవు అయినా 'నెఫ్ట్' ద్వారా నిరాటంకంగా నగదు ట్రాన్స్ ఫర్ చేయొచ్చని తెలిపింది. నిరంతరాయ 'నెఫ్ట్' సేవలు అందిస్తున్నందుకు ప్రధాన బ్యాంకులు అధిక రుసుములు వసూలు చేయబోవని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ఈ నిర్ణయం ఆన్ లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

NEFT
RBI
India
Banks
Money Transfer
24×7
  • Loading...

More Telugu News