Chandrababu: చంద్రబాబుది విజన్ 2020 కాదు..విజన్ 420: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • గత ఐదేళ్లలో రూ.75 వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి
  • మహాత్ముడి ఆశయ సాధనకు జగన్ పని చేస్తున్నారు
  • బ్రాందీ పాలనకు సమాధి చేసి గాంధీ పాలన తెచ్చిన ఏకైక సీఎం జగన్ 

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుపై వైసీపీ సభ్యురాలు రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆమె మాట్లాడుతూ, చంద్రబాబుది ‘విజన్ 2020’ కాదు, ’విజన్ 420’ అని విమర్శించారు. గత ఐదేళ్లలో రూ.75 వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని అన్నారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.

 గ్రామ స్వరాజ్యం రావాలని, అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగిన రోజునే స్వాతంత్ర్యం వచ్చినట్టు అని, గ్రామాల్లో మద్యపానం ఉండకూడదన్న మహాత్ముడి ఆశయాల సాధన కోసం పని చేస్తున్న సీఎం, ఈ రాష్ట్రంలో బ్రాందీ పాలనకు సమాధి చేసి గాంధీ పాలనను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. మద్యపాన నిషేధం అనేది పవిత్రమైన యజ్ఞం అని, కేవలం ఆరు నెలల్లోనే నలభై మూడు వేల బెల్టు షాపులను, 20 శాతం వైన్ షాపులను, నలభై శాతం బార్లను తగ్గించారని వివరించారు.

Chandrababu
Telugudesam
YSRCP
mla
Roja
  • Loading...

More Telugu News