Sachin Tendulkar: సచిన్ కు సలహా ఇచ్చిన వెయిటర్ ఇతనే.. ట్వీట్ చేసిన తాజ్ హోటల్స్!

  • ఆర్మ్ ప్యాడ్ తో ఆట మారిందని సచిన్ కు వెయిటర్ సలహా
  • మోచేతి తొడుగును వెంటనే మార్చిన సచిన్
  • ఆటపై సానుకూల ప్రభావం చూపిన సలహా

మోచేతికి ధరించే ఆర్మ్ ప్యాడ్ తన ఆటతీరును ప్రభావితం చేస్తోందంటూ ఓ హోటల్ వెయిటర్ చెప్పాడని, అతని సలహాతో ఆర్మ్ ప్యాడ్ మార్చుకుని ఆటలో గణనీయమైన మార్పు చవిచూశానని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇటీవల ట్వీట్ చేయడం తెలిసిందే. అమూల్యమైన సలహా ఇచ్చిన ఆ వెయిటర్ ఇప్పుడెక్కడున్నాడో చెప్పగలరా? అంటూ సచిన్ తన ట్వీట్ లో కోరారు.

సచిన్ ట్వీట్ కు తాజ్ హోటల్స్ యాజమాన్యం స్పందించింది. "మా కొలీగ్ తో చిరస్మరణీయ అనుబంధాన్ని పంచుకున్నందుకు థాంక్యూ సచిన్. తాజ్ హోటల్స్ సంస్కృతిని ఘనంగా చాటినందుకు మా ఉద్యోగి పట్ల గర్విస్తున్నాం. అతని పేరు గురుప్రసాద్. ఇప్పుడతనెక్కడున్నాడో గుర్తించాం. త్వరలోనే మీ ఇద్దరూ కలిసేందుకు ఏర్పాటు చేస్తాం" అంటూ ట్వీట్ చేసింది.

Sachin Tendulkar
Waiter
Chennai
Taj Hotels
Arm Pad
  • Loading...

More Telugu News