Bhuvneshwar Kumar: కివీస్ పర్యటనకూ భువనేశ్వర్ కుమార్ డౌటే!

  • ఇప్పటికే విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం
  • మరింత తీవ్రమైన గాయం
  • జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యులపై విమర్శలు

ఇప్పటికే విండీస్‌తో సిరీస్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులో ఉండడం సందేహంగానే ఉంది. గాయం తీవ్రత మరింత పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే భువీ ఐపీఎల్‌లో ఆడతాడని టీమిండియా వర్గాలు పేర్కొన్నాయి. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భువనేశ్వర్ కుమార్‌కు శస్త్రచికిత్స చేయక తప్పదని అయితే, అది ఎప్పుడు, ఎక్కడ? అనేది తేలాల్సి ఉందని సమాచారం.

ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భువీ గజ్జల్లో నొప్పితోనే ఆడాడని, ఆటగాళ్ల గాయాలను గుర్తించడంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) వైద్యులు విఫలమవుతున్నారని ఆ వర్గాలు ఆరోపించాయి. గతంలో వృద్ధిమాన్ సాహా విషయంలోనూ ఇలానే జరిగిందని చెబుతున్నారు. ఇంకా చాలామంది ఆటగాళ్లు గాయాల బారిన పడినా భయపడి వెల్లడించడం లేదని అంటున్నారు.

Bhuvneshwar Kumar
Team India
  • Loading...

More Telugu News