IRS Officer: సస్పెండైన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై కేసు నమోదు
- ఇటీవల కృష్ణకిశోర్‌పై వేటేసిన ఏపీ ప్రభుత్వం
- నిన్న రాత్రి కేసు నమోదు చేసిన సీఐడీ
- ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై సీఐడీ అధికారులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) సీఈవోగా పనిచేసిన ఆయన నేరపూరిత నమ్మకద్రోహానికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఈ కేసు నమోదైంది.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, ప్రభుత్వానికి నష్టం కలిగించారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి చట్టాన్ని కృష్ణకిశోర్ ఉల్లంఘించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఇటీవల కృష్ణకిశోర్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.