Guntur District: మద్యానికి బానిసై డబ్బు కోసం వేధిస్తున్న భర్త.. కడతేర్చిన భార్య

  • మద్యానికి బానిసై కుటుంబ పోషణను గాలికొదిలేసిన
    భర్త
  • కుమారులు పంపిస్తున్న డబ్బులూ తనకే ఇవ్వాలంటూ వేధింపులు
  • బండరాయితో తలపై మోది హతమార్చిన భార్య

మద్యానికి బానిసై డబ్బుల కోసం నిత్యం వేధిస్తున్న భర్తను హతమార్చిందో ఇల్లాలు. గుంటూరు జిల్లా దుర్గిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరమ్మ కాలనీకి చెందిన పగడాల శ్రీనివాసరావు (50), విజయలక్ష్మి భార్యాభర్తలు.

 మద్యానికి బానిసైన శ్రీనివాసరావు కుటుంబ పోషణను పట్టించుకోకపోవడంతో వారి ఇద్దరు కుమారులు ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. ఆ డబ్బులు కూడా తనకే ఇవ్వాలంటూ శ్రీనివాసరావు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండడంతో మనస్తాపం చెందిన విజయలక్ష్మి ఆదివారం భర్త మంచంపై పడుకున్న సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Guntur District
husband
murder
  • Loading...

More Telugu News