China: సూర్యుడికి డూప్లికేట్ ను తయారుచేస్తున్న చైనా

  • టెక్నాలజీలో చైనా పురోగతి
  • ఇటీవలే కృత్రిమ చంద్రుడ్ని రూపొందించిన చైనా
  • హెచ్ఎల్-2ఎం టోకమాక్ పేరుతో కొత్త ప్రాజెక్టు

చైనా సాధించిన సాంకేతిక అభివృద్ధి అంతాఇంతా కాదు. పేరుమోసిన కంపెనీలు రూపొందించే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను అత్యంత చవకగా కుటీర పరిశ్రమల్లో తయారుచేయగలిగిన నేర్పరితనం చైనా సొంతం. రోదసి రంగం, రక్షణ రంగం ఇలా ఏది చూసినా టెక్నాలజీలో చైనా మార్కు సుస్పష్టం. ఈ క్రమంలో చైనా మరో ముందడుగు వేసింది. ఇటీవలే కృత్రిమంగా జాబిల్లిని సృష్టించిన చైనా తాజాగా సూర్యుడికి నకలు తయారుచేసేందుకు సిద్ధమైంది. సూర్యుడి అతులిత శక్తిని భూమ్మీదే పొందడం ఈ ప్రయోగం ముఖ్యోద్దేశం.

ఈ ప్రాజెక్టుకు చైనా శాస్త్రవేత్తలు హెచ్ఎల్-2ఎం టోకమాక్ అనే నామకరణం చేశారు. సూర్యుడి ఉపరితలం ఎలాంటి వాయువులతో నిండివుంటుందో కృత్రిమ సూర్యుడ్ని కూడా అదే రీతిలో రూపొందించనున్నారు. సూర్యుడు నిరంతరం జరిగే కేంద్రక సంలీన క్రియ ద్వారా శక్తిని విడుదల చేస్తుంటాడు. ఇప్పుడీ ఆర్టిఫిషియల్ సూర్యుడిలో అదే ప్రక్రియ ద్వారా 13 రెట్లు అధికంగా శక్తిని తయారుచేయాలన్నది చైనా సైంటిస్టుల యోచన.

  • Error fetching data: Network response was not ok

More Telugu News