Hetmeyer: హెట్మెయర్ సూపర్ సెంచరీ... ఛేజింగ్ లో దూసుకెళుతున్న విండీస్

  • చెన్నైలో భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే
  • 288 పరుగుల లక్ష్యాన్నుంచిన భారత్
  • అర్ధసెంచరీ చేసిన హోప్

వన్ డౌన్ బ్యాట్స్ మన్ షిమ్రోన్ హెట్మెయర్ తన ఫామ్ ను కొనసాగిస్తూ అద్భుత శతకం సాధించాడు. చెన్నైలో టీమిండియాతో జరుగుతున్న వన్డేలో అద్భుతంగా ఆడి 85 బంతుల్లో 100 పరుగులు పూర్తిచేసుకున్నాడు. హెట్మెయర్ కు తోడు ఓపెనర్ షాయ్ హోప్ కూడా సమయోచితంగా ఆడడంతో వెస్టిండీస్ జట్టు లక్ష్యఛేదనలో దూసుకుపోతోంది. భారత్ 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 33 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు ఒక్క వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 17 ఓవర్లలో 110 పరుగులు చేయాల్సి వుంది. ప్రస్తుతం హెట్మెయర్ 101, హోప్ 58 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్ (8) అవుటైనా, హెట్మెయర్, హోప్ జోడీ చక్కని ఆటతీరుతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడింది.

Hetmeyer
Windies
India
Chennai
Cricket
Century
  • Loading...

More Telugu News