New Delhi: ఢిల్లీని తాకిన పౌరసత్వ చట్ట సవరణ నిరసనలు... మూడు బస్సులకు నిప్పుపెట్టిన విద్యార్థులు

  • పౌరసత్వం చట్ట సవరణ బిల్లు తీసుకువచ్చిన కేంద్రం
  • ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనజ్వాలలు
  • ఇతర ప్రాంతాలకు వ్యాప్తి

కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన ఆగ్రహావేశాలు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీని సైతం నిరసన సెగలు తాకాయి. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యాసంస్థ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు మూడు బస్సులకు నిప్పుపెట్టారు. మరో బైక్, కారు కూడా నిరసన జ్వాలలకు కాలి బూడిదయ్యాయి. విద్యార్థుల ఆందోళనల కారణంగా ఢిల్లీలోని ఓఖ్లా అండర్ పాస్ నుంచి సరితా విహార్ వైపు వెళ్లే మార్గాన్ని మూసివేశారు.

New Delhi
Buses
Jamia Milia Islamia
India
BJP
  • Loading...

More Telugu News