YSRCP: రేప్ చేసిన వాడికి శిక్ష విధిస్తారు తప్ప కులాలు చూస్తారా?: యనమలపై వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఫైర్

  • కులాల మధ్య ఎలా చిచ్చు పెట్టాలని టీడీపీ చూస్తోంది
  • ‘మీరేమన్నా పిచ్చివాళ్లా? 
  • చట్టం అంటే మీకు తెలియదా?’

రేప్ లకు పాల్పడ్డ సొంత సామాజికవర్గం వారిపై చర్యలు తీసుకోరా అంటూ సీఎం జగన్ ని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.యనమలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కులాల మధ్య ఏ రకంగా చిచ్చు పెట్టాలని టీడీపీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు. ప్రకాశం జిల్లాల్లో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల్లో నిందితులు ఫలానా కులానికి చెందిన వారు కనుక చర్యలు తీసుకోరా అని టీడీపీ నేతలు ప్రశ్నించడం దారుణమని అన్నారు.

‘మీరేమన్నా పిచ్చివాళ్లా? చట్టం అంటే మీకు తెలియదా?’ అని ప్రశ్నించారు. తప్పు చేసిన వ్యక్తి రెడ్డి, చౌదరి, నాయుడు అయినా.. ఇంకెవరైనా సరే దిశ చట్టం కింద వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయనాయకుడైనా, గొప్ప పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా ఎవరైనా సరే బాలికల జోలికి వెళ్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఫలాన కులాలను వదిలేయమని చట్టమేమి చెప్పదని, అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం చేతగాక, ప్రజల్లో చులకనై పోయిన టీడీపీ, యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తులతో దిగజారుడు మాటలు మాట్లాడిస్తూ నీచ స్థాయికి దిగజారుతున్నారని ధ్వజమెత్తారు.

YSRCP
mla
Srikanthreddy
Telangana
Yanamala
  • Loading...

More Telugu News