Chennai: చెన్నై వన్డే: రాణించిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్

  • భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే
  • టాస్ ఓడిన టీమిండియా
  • తక్కువ స్కోర్లకే అవుటైన రాహుల్, కోహ్లీ

చెన్నైలో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 31 ఓవర్లలో 3 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును రోహిత్ శర్మ (36), శ్రేయాస్ అయ్యర్ జోడీ ఆదుకుంది. అయితే జట్టు స్కోరు 80 పరుగుల వద్ద రోహిత్ అవుటయ్యాడు. ఈ దశలో అయ్యర్ తో జతకలిసిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిలకడ ప్రదర్శించాడు. దాంతో స్కోరుబోర్డు సాఫీగా ముందుకు సాగింది. ప్రస్తుతం అయ్యర్ 49, పంత్ 40 పరుగులతో ఆడుతున్నారు.

Chennai
ODI
Team India
West Indies
Cricket
  • Loading...

More Telugu News