CPI: మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దౌర్భాగ్యం: సీపీఐ రామకృష్ణ

  • ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదన్న రామకృష్ణ
  • ఈ నెల 19న ఏపీలో నిరసనలు చేపట్టాలని నిర్ణయం
  • బీజేపీ సొంత అజెండాను ప్రజలపై రుద్దుతోందని ఆరోపణ

కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఈ నెల 19న ఏపీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దౌర్భాగ్యం అని పేర్కొన్నారు. బీజేపీ తన సొంత అజెండాను ప్రజలపై రుద్దుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు.

ఇటు ఏపీ సర్కారుపైనా వామపక్ష నేత వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ నేడు బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రాజధానిపై బొత్స వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నాయని, ఈ నెల 28న రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలతో సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు.

CPI
Ramakrishna
Andhra Pradesh
Jagan
BJP
NRC
  • Loading...

More Telugu News