Guntur District: కాల్ మనీ వేధింపులు.. తాడేపల్లి పీఎస్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం!

  • ఉండవల్లికి చెందిన నివాసి వెంకట్రామయ్య
  • ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపణ
  • రూ.6 లక్షలు తీసుకుంటే  రూ.23 లక్షలు వసూలు చేశారని ఆరోపణ

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉండవల్లికి చెందిన నివాసి వెంకట్రామయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే, పోలీసులు, స్థానికులు ఆయన్ని అడ్డుకున్నారు. కాల్ మనీ వ్యవహారంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, పైగా దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు.

ఆరు లక్షల రూపాయలు తీసుకున్న తన వద్ద నుంచి ఇప్పటి వరకూ ఇరవై మూడు లక్షల రూపాయలు వడ్డీల రూపంలో వసూలు చేశారని ఆరోపించాడు. తనకు డబ్బులు ఇచ్చినప్పుడు మూడు రూపాయల వడ్డీ అని చెప్పి పన్నెండు రూపాయల చొప్పున వసూలు చేశారని ఆరోపించిన వెంకట్రామయ్య, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని సదరు వ్యాపారి బెదిరించినట్టు ఆరోపించాడు.

Guntur District
Tadepally
police station
call-money
  • Loading...

More Telugu News