Ramcharan: రామ్ చరణ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్

  • రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్
  • చెర్రీతో ఓ సినిమా నిర్మిస్తానని వ్యాఖ్య
  • దర్శకుడు ఇంకా దొరకలేదని వ్యాఖ్య

రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..  ఆదాయం కోసం సినిమాలు నిర్మిస్తానని ఓ  ఇంట‌ర్వ్యూలో చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనూ ఓ సినిమా నిర్మిస్తానని తెలిపారు. ఆ సినిమాకు ద‌ర్శ‌కుడు ఇంకా దొర‌క‌లేదని, ఈ కారణంగానే  ఆలస్యం అవుతుందని తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని చెప్పారు.
 
కాగా, సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయ కార్యక్రమాలపైనే పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. ఆయన హీరోగా ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 'పింక్' సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. నిర్మాతగా మాత్రం సినిమాలు తీయాలని ఆయన భావిస్తున్నారు.

Ramcharan
Pawan Kalyan
Jana Sena
  • Loading...

More Telugu News