Drunk Driving: డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులకు చిక్కి...వీరంగం!

  • నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన 
  • మద్యం సేవించి వాహనం నడుపుతుండడంతో అడ్డుకున్న పోలీసులు 
  • వారితో వాగ్వాదానికి దిగిన చోదకుడు

చేసింది పొరపాటు... ఒప్పించి తప్పించుకోవడమో, ఫైన్ చెల్లించి బయటపడడమో చేయడం మానేసి ఓ వ్యక్తి అర్ధరాత్రి హల్ చల్ చేయడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఆసిఫ్‌నగర్-గుడి మల్కాపూర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి తర్వాత ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకన్ అండ్‌ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఆ సమయంలో మహ్మద్ షఫీ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికిపోయాడు. పోలీసులు జరిమానా చెల్లించమంటే చెల్లించకుండా  పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో కాసేపు  హల్‌చల్‌ చేశాడు. ఎంత నచ్చచెప్పినా వినక పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని  పంపించారు.

Drunk Driving
Hyderabad
halchal
  • Loading...

More Telugu News