Vijay Sai Reddy: రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే తెలిసినవే: పవన్ పై విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

  • దత్త పుత్రుడు పవనిజం గ్రంథాన్ని రాశాడంటే ఎవరూ నమ్మలేదు
  • గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే
  • స్పీచ్ లు,  సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్లో ఎవరో రాస్తున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఆ పార్టీ మాజీ నేత రాజు రవితేజ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ పవన్ గురించి రాజు రవితేజ చెప్పిన విషయాలు అందరికీ తెలిసినవే అని అన్నారు. ఇతరుల సాయంతోనే పవన్ కల్యాణ్ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు.

'రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే తెలిసినవే. దత్త పుత్రుడు పవనిజం గ్రంథాన్ని రాశాడంటే ఎవరూ నమ్మలేదు. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే. స్పీచ్ లు,  సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదు' అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. 

Vijay Sai Reddy
YSRCP
Jana Sena
  • Loading...

More Telugu News