Tamil Nadu: మహిళను హత్యచేసిన వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్థులు

  • ప్రియురాలి కూతురిని తెచ్చేందుకు వెళ్లి ఆమె అత్తతో వాగ్వాదం 
  • ఆవేశం ఆపుకోలేక గొంతు నులిమి చంపేసిన వైనం 
  • అడ్డుకున్న గ్రామస్థులపై యాసిడ్ దాడి

తమ గ్రామ మహిళను హత్య చేయడమేకాక అడ్డుకున్న తమపై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపారు. పోలీసుల కథనం మేరకు...తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా పుదుచత్రం సమీపంలోని గ్రామానికి చెందిన మహిళ(38)కు శామ్యూల్ అనే అతను కూలి పనుల్లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ఇద్దరి మధ్యా వివాహేతర సంబంధానికి దారితీసింది.

సదరు మహిళ భర్త చనిపోవడంతో ముగ్గురు ఆడపిల్లలతో వేరుగా ఉంటోంది. ఆమె మూడో కుమార్తె తన ప్రియురాలి అత్తవద్ద ఉంటోంది. దీంతో ఆమెను తెచ్చేందుకు శామ్యూల్ తన ప్రియురాలి అత్త ఇంటికి వెళ్లాడు. అమ్మాయిని పంపాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు.

ఆ సందర్భంగా ఆమె ఇంటి తలుపులు మూసేసి ఆమెను కత్తితో పొడిచి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె కేకలతో వచ్చి గ్రామస్థులు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా తలుపు వేసి ఉంది. దీంతో ఇంటి పైకప్పు తొలగించి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో వారి పై యాసిడ్ పోశాడు.

అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించడంతో గ్రామస్థులు వెంటపడి చితక బాదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. గతంలోనే శామ్యూల్ పై హత్య, ఇతర కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Tamil Nadu
Crime News
women adn man murdered
  • Loading...

More Telugu News