Chittoor District: ప్రేమ పేరిట మోస పోయానన్న మనస్తాపంతో... డిగ్రీ విద్యార్థిని సూసైడ్!

  • చిత్తూరులో ఘటన
  • ప్రేమించానని చెప్పి, పెళ్లికి అంగీకరించని ప్రియుడు
  • కఠినంగా శిక్షించాలని బాధితుల డిమాండ్

ప్రేమ పేరు చెబితే, దారుణంగా మోసపోయానన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, చిత్తూరు లాలు గార్డెన్స్ లో నివాసం ఉంటూ, మదనపల్లిలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఫాతిమా (19) అనే యువతి, డ్రైవర్ గా పని చేస్తున్న ఇబ్రహీం అనే యువకుడితో గత కొంత కాలంగా ప్రేమలో ఉంది.

ఈ క్రమంలో వారు సన్నితంగానూ మెలిగారు. ఇటీవల పెళ్లి ప్రస్తావనను ఆమె తీసుకురాగా, అప్పటి నుంచి ఫాతిమాను ఇబ్రహీం దూరం పెట్టసాగాడు. ప్రేమిస్తున్నానని చెబితే, తాను మోసపోయానని అర్థం చేసుకున్న ఆమె, ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. తన కుమార్తెను దారుణంగా మోసం చేసి, ఆమె ఆత్మహత్యకు కారణమైన ఇబ్రహీంను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Chittoor District
Lover
Sucide
Degree Student
  • Loading...

More Telugu News