Sanke: బావిలో పడిన పామును కాపాడేందుకు వెళితే, భయపడి చుట్టేసుకుంది... పట్టుతప్పింది... వైరల్ వీడియో!

  • కేరళలోని త్రిసూర్ లో ఘటన
  • పాము కోసం బావిలోకి దిగిన షగిల్
  • పైకి వస్తూ, మరోసారి బావిలో పడ్డ వైనం

బావిలో పడిన పామును కాపాడేందుకు వెళ్లిన ఓ యువకుడు, తృటిలో ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ లో జరిగింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, ఓ పాము బావిలో పడిందని షగిల్ అనే స్నేక్ ఫ్రెండ్ కు సమాచారం వచ్చింది. తొలుత వల వేసి దాన్ని బయటకు తీయాలని భావించినా, బావి లోతుగా ఉండటంతో తాళ్ల సాయంతో కిందకు దిగాలని షగిల్ భావించాడు. మెల్లగా కిందకు దిగి, పామును చూసి, దాని కాటు బారిన పడకుండా వేల్లాడుతూ, దాని తలను బలంగా పట్టుకోగలిగాడు. అయితే, ఆ తరువాతే అతని అంచనా తప్పింది.

పామును బయటకు తీసుకుని వస్తున్న క్రమంలో, తనకేదో ఆపద తలెత్తనుందని భావించిందో ఏమో, షగిల్ ను అది గట్టిగా చుట్టేసుకుంది. అయినా, పట్టు వదలకుండా దాన్ని పట్టుకునే ఉన్నాడు షగిల్. బావి పైన ఉన్న స్థానికులు, తాడును నెమ్మదిగా లాగుతుంటే, పై వరకూ వచ్చాడు. అయితే, అతనికి చేతులు పట్టుకుని సాయం చేయాల్సిన వారు, పామును చూసి భయపడ్డారో ఏమో... ఆలస్యం చేశారు. దీంతో షగిల్ పట్టు తప్పి పాముతో సహా బావిలో మరోసారి పడిపోయాడు. అప్పటికి కూడా పాము తలను వదలని షగిల్, రెండో ప్రయత్నంలో దాన్ని బయటకు తీసుకుని వచ్చి, సమీపంలోని అడవిలో వదిలిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News