Twitter: ఫన్నీ ట్వీట్ షేర్ చేసిన కల్వకుంట్ల కవిత!

  • ఈ ఉదయం ట్విట్టర్ లో ట్వీట్
  • తన కుమారుడు షేర్ చేశాడని వెల్లడి
  • వైరల్ అవుతున్న కవిత ట్విట్టర్

నిజామాబాద్ మాజీ లోక్ సభ సభ్యురాలు, టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవిత, ఈ ఉదయం తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్న ఓ ఫన్నీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన కుమారుడు ఈ ట్వీట్ ను తనకు పంపించాడని ఆమె చెప్పారు. ఇందులో 'మిస్టర్ బీన్' చిత్రం కనిపిస్తుండగా, వీకెండ్స్ ను ఉద్దేశించి, దానిపై ఓ కామెంట్ ఉంది. "నేను ఏమనుకుంటున్నానంటే... వారాంతాలు చైనాలో రూపుదిద్దుకున్నట్టున్నాయి. అందుకే అవి ఎక్కువ కాలం ఉండవు" అన్న కొటేషన్ ఉంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సరదాగా అభిప్రాయాలు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే కవిత, తనకు తారసపడిన సరదా కబుర్లను తరచుగా నెటిజన్లతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే.

Twitter
K Kavitha
Tweet
Mr Bean
  • Error fetching data: Network response was not ok

More Telugu News