Anantapur District: ఏపీలో పర్యటించిన సీపీ సజ్జనార్... సెల్ఫీల కోసం యువత పోటీ!

  • అనంతపురం జిల్లా లేపాక్షిని సందర్శించిన సజ్జనార్
  • సంప్రదాయ స్వాగతం పలికిన అధికారులు
  • కుటుంబ ఇలవేల్పు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు

తెలంగాణలోని సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న వీసీ సజ్జనార్, ఏపీ పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లా లేపాక్షిని సందర్శించిన వేళ, యువతీ యువకులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇటీవల దిశ హత్యాచారం తరువాత, 10 రోజుల వ్యవధిలో వారి ఎన్ కౌంటర్ జరగడంతో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

ఇక లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయానికి సంప్రదాయ పంచెకట్ట, లాల్జీ ధరించి, కుటుంబీకులతో కలిసి సజ్జనార్ రాగా, ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. కర్ణాటకకు చెందిన సజ్జనార్ కుటుంబానికి వీరభద్రస్వామి ఇలవేల్పు. వీరభద్రునికి, దుర్గాదేవికి సజ్జనార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం బయట తనకోసం వేచి చూస్తున్న యువతను ఆయన పలకరించారు. వారితో సెల్ఫీలు దిగారు.

Anantapur District
VC Sajjanar
Lepakshi
Selfi
  • Loading...

More Telugu News