Golkonda: గోల్కొండ కోట కింద అద్భుతం... తవ్వకాల్లో బయటపడిన మరో కోట!

  • ఏఎస్ఐ ఆధ్వర్యంలో తవ్వకాలు
  • నయాఖిల్లాలో బయట పడుతున్న 15వ శతాబ్దం నాటి వస్తువులు
  • మరో కట్టడం ఉండవచ్చని అనుమానిస్తున్న శాస్త్రవేత్తలు

నాలుగు వందల సంవత్సరాల హైదరాబాద్ చరిత్రకు నిదర్శనంగా నిలిచే గోల్కొండ కోట కింద మరో అద్భుతమైన కోట ఉన్నట్టు తెలుస్తోంది. కోట పక్కనే ఉన్న నయాఖిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా, ఇక్కడ మరో కోట ఆనవాళ్లు బయట పడుతున్నాయి. గోల్ఫ్ కోర్స్ పక్కనే ఉన్న సుమారు 40 ఎకరాల స్థలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధీనంలో ఇటీవల తవ్వకాలు మొదలయ్యాయి.

తొలి రోజు నుంచే పురాతన వస్తువులు, రాతి శిలలు బయట పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ 15వ శతాబ్దం నాటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో గోల్కొండ భూగర్భంగా మరో కట్టడం ఉందని చరిత్రకారులు, ఏఎస్ఐ అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఏఎస్ఐ సౌతిండియా రీజనల్ డైరెక్టర్ మహేశ్వరి, మరింత జాగ్రత్తగా తవ్వకాలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News