Dadi Veerabhadra Rao: స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర: దాడి వీరభద్రరావు ఆరోపణ

  • ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • పోస్కోకు భూకేటాయింపు నిర్ణయం వెనక్కితీసుకోవాలని డిమాండ్
  • లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ నేత దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రూ.2 లక్షల కోట్ల విలువైన భూమికి కేవలం రూ.4849 కోట్ల ధరను నిర్ణయించారని అన్నారు. పోస్కోకు భూకేటాయింపు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. లేదంటే 1970 తరహాలో భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Dadi Veerabhadra Rao
Vizag
Steel Plant
YSRCP
NDA
  • Loading...

More Telugu News