Ruler: 'రూలర్' ట్రైలర్ లో నన్ను చూసి బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకున్నానేమో అనుకున్నారు: బాలకృష్ణ

  • వైజాగ్ లో 'రూలర్' ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఆసక్తికరంగా బాలయ్య స్పీచ్
  • తనకు భయంలేదన్న నందమూరి హీరో

వైజాగ్ లో రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. రూలర్ స్టిల్స్, ట్రైలర్లో తనను చూసి అందరూ ఆశ్చర్యపోయారని, కొందరు గ్రాఫిక్స్ అనుకున్నారని వెల్లడించారు. తాను అంత స్లిమ్ గా ఉండడం చూసి బేరియాట్రిక్ సర్జరీలు, సక్షన్ ప్రక్రియలు చేయించుకున్నానేమోనని భావించారని అన్నారు. వాస్తవానికి ఇవన్నీ తాను చెప్పనవసరం లేదని, వేకువజామున మూడున్నర, నాలుగు గంటలకే లేచి ఇక్కడి రామకృష్ణ బీచ్ లో వాకింగ్ చేసేవాడ్నని తెలిపారు.

వైజాగ్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని, బాబాయ్ అబ్బాయ్ చిత్రం నుంచి తనవి అనేక సినిమాలు ఇక్కడే షూటింగ్ జరుపుకున్నాయని చెప్పారు. మరే హీరో కూడా వైజాగ్ లో అన్ని సినిమాలు చేసుండకపోవచ్చని అన్నారు. తనకు భయంలేదని, తనకు ఆ ధైర్యాన్నిచ్చింది ఒకరు తన తండ్రి ఎన్టీఆర్ అయితే, రెండోది అభిమానులని వివరించారు. ఈ వైజాగ్ రోడ్లపైనే లెజెండ్ సినిమా కోసం గుర్రంపై పరిగెడుతూ అద్దాన్ని పగులగొడుతూ వెళ్లడం ఎంతోమంది చూశారని వెల్లడించారు. ఆ సినిమా ఒక థియేటర్ లో మూడు సంవత్సరాలు ఆడిందని పేర్కొన్నారు.

Ruler
Balakrishna
Andhra Pradesh
Vizag
Tollywood
  • Loading...

More Telugu News