Ruler: నేను అందరితోనూ పనిచేయలేను: 'రూలర్' వేడుకలో బాలయ్య వ్యాఖ్యలు

  • వైజాగ్ లో రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఉత్సాహభరితంగా బాలకృష్ణ ప్రసంగం
  • సంస్కృత శ్లోకాలు, పద్యాలతో హోరెత్తించిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక నటించిన రూలర్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు వైజాగ్ లోని ఎంజీఎం మైదానం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, రూలర్ చిత్రం కోసం తాము మొదట అనుకున్న కథ వేరని, ఆ కథను పక్కనబెట్టి మరో కొత్త కథ కోసం పరుచూరి మురళిని సంప్రదించామని వెల్లడించారు. తాను అందరితోనూ పనిచేయలేనని, అందరితో ఇమడలేనని, అభిమానులు ఏంకావాలనుకుంటే అది ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.

సినిమా అంటే తనకు ఇష్టం అని తెలిపారు. సినిమాను ప్రేమించాలే తప్ప వెర్రి, వ్యామోహం ఉండరాదని సూచించారు. కాగా, తన ప్రసంగంలో బాలయ్య సామాన్యులకు అంత తేలిగ్గా అర్థంకాని, పలకడానికి సాధ్యం కాని సంస్కృత సమాసాలు, శ్లోకాలను, గ్రాంథిక పదజాలాన్ని విరివిగా గుప్పించారు. ఈ సందర్భంగా అభిమానులు ఈలలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.

Ruler
Vizag
Pre Release Event
Balakrishna
Tollywood
  • Loading...

More Telugu News