Ayesha: ఆయేషా తల్లి వెనుక ఎవరో ఉండి అలా మాట్లాడిస్తున్నారు: వైసీపీ నేత రోజా

  • నేరస్తులు ఎవరో రోజాకు తెలుసన్న ఆయేషా తల్లి
  • ఆ కుటుంబానికి అండగా నిలిచింది తానేనన్న రోజా
  • ఆయేషా కుటుంబానికి న్యాయం కోసం రాష్ట్రమంతా తిరిగామని వెల్లడి

రాష్ట్రంలో 12 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆయేషా ఘటనలో సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయేషా మృతదేహాన్ని వెలికితీసి రీపోస్టుమార్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఆయేషా తల్లి వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయేషా మృతికి కారకులు ఎవరో రోజాకు తెలుసంటూ ఆమె ఆరోపించారు. దీనిపై రోజా స్పందించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, తనపై ఆయేషా తల్లి వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు.

ఘటన జరిగిన సమయంలో ఓ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆ కుటుంబానికి అండగా నిలిచింది తానేనని తెలిపారు. ఆయేషా కుటుంబానికి న్యాయం కోసం రాష్ట్రమంతా తిరిగి పోరాటం చేశామని గుర్తుచేశారు. నేరస్తులు ఎవరో తనకు తెలుసని ఆరోపణలు చేస్తున్నారని, తనకు తెలిసిన నేరస్తులు పోలీసులకు, చట్టానికి తెలియరా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయేషా తల్లి వెనుక ఎవరో ఉండి అలా మాట్లాడిస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు.

Ayesha
Andhra Pradesh
Roja
YSRCP
Police
CBI
  • Loading...

More Telugu News