Asaduddin Owaisi: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్

  • పౌరసత్వ చట్ట సవరణ బిల్లు తీసుకువచ్చిన ఎన్డీయే
  • దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యతిరేకత
  • సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఒవైసీ

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పౌరసత్వ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రాజ్యాంగ వ్యవస్థను సంప్రదిస్తామని, అన్ని రకాల సాధనాలను ఉపయోగించుకుంటామని తెలిపారు.

అసద్ మాత్రమే కాదు, పౌరసత్వ చట్ట సవరణపై సుప్రీంను ఆశ్రయించిన వారిలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, న్యాయవాది ఎంఎల్ శర్మ, ఆల్ అస్సామ్ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఉన్నాయి.

Asaduddin Owaisi
Supreme Court
NDA
India
MIM
Hyderabad
  • Loading...

More Telugu News