sourav ganguly selfie at Lords ground: లార్డ్స్ మైదానంలో ‘దాదా’ సెల్ఫీ!

  • ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశం
  • బీసీసీఐ కార్యదర్శి జైషా, ట్రెజరర్ అరుణ్ సింగ్ లతో హాజరు
  • కొత్త బాధ్యతలతో వచ్చానంటూ గంగూలీ ట్వీట్

క్రికెట్ కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ దేశంలోని లార్డ్స్ మైదానంతో  బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి ప్రత్యేక అనుబంధముంది. ఈ మైదానంలోకి తాజాగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాతో అడుగుపెట్టాడు. గతంలో ఇక్కడకు ఆటగాడిగా, కామెంటేటర్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశం కావడానికి బీసీసీఐ కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ సింగ్ లతో కలిసి ఇక్కడకు వచ్చాడు.

ఈ సందర్భంగా వారితో కలిసి గంగూలీ సెల్ఫీ దిగి, చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.‘ఇద్దరు ఆప్త మిత్రులతో సరికొత్త పదవీ బాధ్యతలతో మరోసారి తిరిగొచ్చాను’ అని ట్వీట్ చేశాడు. లార్డ్స్ క్రికెట్ మైదానం అధికారులు సౌరవ్ ట్వీట్ పట్ల అనందం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేశాడు. గంగూలీ చొక్కా విప్పిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. గంగూలీ 1996లో ఇక్కడే తన టెస్ట్ కెరియర్ ప్రారంభించాడు. ఇంగ్లండ్ పై అరంగేట్రంలోనే సెంచరీ సాధించి తన సత్తా చాటాడు. 2002లో ఇదే మైదానంలో ఇంగ్లండ్ పై నాట్ వెస్ట్ సిరీస్ గెలిచి గంగూలీ తన చొక్కా విప్పి సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

sourav ganguly selfie at Lords ground
Cricket
  • Loading...

More Telugu News