Pawan Kalyan: బాగా ఆడుతున్న ఆటగాళ్లను కావాలని రనౌట్ చేసే వ్యక్తి పవన్ కల్యాణ్: రాజు రవితేజ

  • జనసేనకు గుడ్ బై చెప్పిన రాజు రవితేజ
  • పవన్ పై విమర్శనాస్త్రాలు
  • పవన్ వైఖరితోనే నేతలు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యలు

జనసేన పార్టీ వ్యవస్థాపనలో కీలకంగా వ్యవహరించిన రాజు రవితేజ ఇప్పుడు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ పై తన అభిప్రాయాలు వెల్లడించారు. తనపై ప్రభావం చూపించే వ్యక్తులను పార్టీ నుంచి పవనే బైటికి నెట్టేస్తారని, పార్టీలో అన్ని వ్యవహారాలు తన గుప్పిట్లో ఉండాలని ప్రయత్నిస్తారని ఆరోపించారు.

"ఆయనే కెప్టెన్, ఆయనే బ్యాట్స్ మన్, ఆయనే బౌలర్, ఆయనే ఫీల్డర్, చివరికి ఆయనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఎవరైనా బాగా ఆడుతుంటే వాళ్లను కావాలని రనౌట్ చేసే వ్యక్తి పవన్ కల్యాణ్. జనసేన పార్టీని చాలామంది వీడడానికి కారణం అదే" అంటూ ఆరోపణలు గుప్పించారు. తనకు తెలిసినంతవరకు పవన్ కల్యాణ్ కు కులం, మతంపై పెద్దగా ఆసక్తిలేదని, కానీ, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కులం, మతాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న తీరే చాలా ప్రమాదకరం అని రాజు రవితేజ పునరుద్ఘాటించారు.

Pawan Kalyan
Raju Raviteja
Jana Sena
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News