Malladi Vishnu: సభను స్తంభింపజేయాలని చంద్రబాబు ప్రయత్నించారు: మల్లాది విష్ణు

  • చంద్రబాబుపై మల్లాది విష్ణు విమర్శలు
  • ప్రతిదానికి అడ్డుపడుతున్నారని ఆరోపణ
  • ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదని వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ప్రజల అభీష్టం మేరకు పరిపాలన సాగిస్తుంటే, చంద్రబాబు ప్రతి అంశంలోనూ అడ్డంకిగా మారారని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్, నాడు-నేడు, అమ్మ ఒడి, ఇంగ్లీషు మీడియం విద్య ఇలా ప్రతి విషయంలోనూ అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. ఆఖరికి ఐదు రోజుల పాటు సభను స్తంభింపజేసేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజలు ఓటుతో తిరస్కరించినా చంద్రబాబు ప్రవర్తనలో మార్పులేదని, అసెంబ్లీలోనూ ఆయన వ్యవహార శైలి సరిగాలేదని విమర్శించారు. దిశ చట్టంపై చర్చ జరగాలని భావిస్తే ఉల్లి గురించి లేనిపోని రభస సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Malladi Vishnu
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh
Jagan
  • Loading...

More Telugu News