Police: 'సమత' హత్యాచారం కేసులో ఛార్జిషీటు దాఖలు
- ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
- సోమవారం నుంచి విచారణ ప్రారంభం
- సమత భర్తకు ప్రభుత్వ ఉద్యోగం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపటూర్ గ్రామానికి చెందిన మహిళ 'సమత'పై గత నెల కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ రోజు ఛార్జిషీటు దాఖలైంది. ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 44 మంది సాక్షులతో కుమురం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఛార్జీషీటు దాఖలు చేశారు. సోమవారం నుంచి ఈ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది.
కాగా, ఈ కేసులో మృతురాలి ఇద్దరు పిల్లలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అలాగే, 'సమత' భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతినెలా పెన్షన్, రెండు పడకగదుల ఇల్లు ఇవ్వనున్నారు.