Crime News: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన.. అనుమానంతో భార్య హత్య

  • నిన్నరాత్రి దంపతుల మధ్య వివాదం 
  • ఆగ్రహాన్ని ఆపుకోలేని భర్త గొడ్డలితో దాడి 
  • అనంతరం పోలీసులకు లొంగుబాటు

అనుమానం పెనుభూతమై దంపతుల మధ్య వివాదాన్ని రేపడమేకాక ఆమె మరణానికి కారణమైంది. భార్య తీరును అనుమానించిన ఓ భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. 

గ్రామానికి చెందిన కె.వెంకటరత్నం, శ్రీలక్ష్మి (35) దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వెంకటరత్నం కొన్నాళ్లుగా ఆమెను వేధిస్తున్నాడు. నిన్నరాత్రి ఇదే విషయమై దంపతుల మధ్య వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన వెంకటరత్నం సమీపంలోని గొడ్డలి తీసుకుని భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తన్నారు.

Crime News
Krishna District
wife murdered
  • Loading...

More Telugu News