AAP: మరో పార్టీకి పనిచేయనున్న ప్రశాంత్ కిశోర్

  • ఆప్ తో కలసి పని చేయబోతున్న ప్రశాంత్ కిశోర్
  • ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన కేజ్రీవాల్
  • ప్రశాంత్ కిశోర్ తో కలిసి పని చేయబోతుండటం సంతోషకరమన్న కేజ్రీ

మన దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు రాజకీయ వర్గాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సేవలను ఉపయోగించుకుంటే గెలుపు తథ్యమని వివిధ పార్టీలు భావిస్తుంటాయి. గతంలో ఆయన సేవలను బీజేపీ, వైసీపీ ఉపయోగించుకున్నాయి. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి ఆయన పని చేస్తున్నారు. తాజాగా ఆయన మరో పార్టీతో చేతులు కలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం ఆయన పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించారు.

ప్రశాంత్ కిశోర్ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ తమతో కలసి పని చేయబోతోందన్న విషయాన్ని అందిరితోనూ పంచుకోవడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని కేజ్రీవాల్, ప్రశాంత్ కిశోర్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

AAP
Prashant Kishor
IPAC
Arvind Kejriwal
  • Loading...

More Telugu News