Tathagata Roy: ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారు ఉత్తర కొరియాకు వెళ్లిపోవచ్చు: మేఘాలయ గవర్నర్ వ్యంగ్య సలహా

  • మతం ఆధారంగా మన దేశం ఒకసారి విడిపోయిందన్న తథాగత రాయ్
  • విభజిత ప్రజాస్వామ్యం మనకు అవసరమని వ్యాఖ్య
  • రాజ్ భవన్ ను ముట్టడించిన ఆందోళనకారులు

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వివాదం నేపథ్యంలో రెండు విషయాలను మనం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. మతం ఆధారంగానే మన దేశం ఒకసారి విడిపోయిందనే విషయాన్ని మర్చిపోకూడదని చెప్పారు. విభజిత ప్రజాస్వామ్యం మనకు అవసరమని తెలిపారు. దీనిని వ్యతిరేకించేవారు ఉత్తర కొరియాకు వెళ్లిపోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలపై నిరసనకారులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. రాజ్ భవన్ ను ముట్టడించడానికి యత్నించారు. భద్రతా బలగాలను దాటుకుని, లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయుగోళాలను ప్రయోగించి, ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు ఆందోళనకారులతో పాటు ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News