holidays: ఏపీలో ఈ నెల 24 నుంచి క్రిస్మస్, జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు

  • ప్రకటన విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ 
  • ఇంటర్ విద్యార్థులకు జనవరి 11 నుంచి... 
  • వార్షిక ప్రణాళికలో పేర్కొన్న ఇంటర్ బోర్డు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు ఈనెల 24వ తేదీ నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి ఒకటితో క్రిస్మస్ సెలవులు ముగుస్తాయి. జనవరి 10వ తేదీన సంక్రాంతి సెలవులు మొదలై 20వ తేదీతో ముగుస్తాయి. అదేవిధంగా ఇంటర్ బోర్డు తన వార్షిక ప్రణాళికలో జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రభుత్వ కళాశాలలకు సెలవులు ప్రకటించింది.

holidays
chismus
sankrathi
  • Loading...

More Telugu News