Krishna District: కూతురిని ప్రియుడి వద్దకు పంపిన తల్లి.. రాత్రంతా నరకం!

  • కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఘోరం
  • చిన్నారికి నరకం చూపించిన తల్లి ప్రియుడు
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. సభ్యసమాజం తల దించుకునేలా ఓ తల్లి అత్యంత దారుణానికి ఒడిగట్టింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, మార్తమ్మ అనే తల్లి మైనర్ అయిన తన కన్న కూతురినే తన ప్రియుడు రాంబాబు వద్దకు పంపంది.

ఇక ఆ దుర్మార్గుడు ఆ చిన్నారికి రాత్రంతా నరకం చూపించాడు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తన నానమ్మకు చెప్పింది. వెంటనే వారు జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మార్తమ్మ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Krishna District
Rape
  • Loading...

More Telugu News