Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై నేడు అభిశంసన ఓటింగ్

  • అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు అభియోగాలు
  • రాజకీయ లబ్ధి కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న డెమోక్రాట్లు
  • గురువారం ఉదయం నుంచి నిన్న తెల్లవారుజాము వరకు కొనసాగిన విచారణ

ఉక్రెయిన్ నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై నేడు ఓటింగ్ జరగనుంది. ట్రంప్ ఎదుర్కొంటున్న ఆరోపణలపై గురువారం మొదలైన జ్యుడీషియరీ విచారణ నిన్న తెల్లవారుజాము వరకు కొనసాగింది. నిజానికి ఇది పూర్తికాగానే ఓటింగ్ నిర్వహించాలని భావించారు. అయితే, సభ్యులకు విరామం అవసరమని భావించి ఓటింగ్‌ను నేటికి వాయిదా వేశారు.

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ జోబిడెన్‌ను తప్పించేందుకు ట్రంప్ ఉక్రెయిన్‌‌పై ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ దేశంలో బిడెన్‌కు ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపించాలని ఒత్తిడి తీసుకొచ్చారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు జరిపించకుంటే ఆ దేశానికి అందించాల్సిన సైనిక సాయాన్ని నిలిపివేస్తామని బెదిరించినట్టు ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News