Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు

  • రాహుల్ ‘రేపిన్ ఇండియా’ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
  • అత్యాచారాలను రాజకీయ అస్త్రాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు 
  • కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

‘రేపిన్ ఇండియా’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరారు. ఓ రాజకీయ నాయకుడు అత్యాచార ఘటనలను తొలిసారి ఇలా ఉపయోగించుకుంటున్నారని, పురుషులందరూ రేపిస్టులేనని అంటున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు.

అత్యాచారాలను రాజకీయ అస్త్రాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు. దేశంలోని మహిళలపై అత్యాచారాలు జరగాలని రాహుల్ కోరుకుంటున్నారన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో విజయం కోసమే రాహుల్ అత్యాచార ఘటనలను ఉపయోగించుకుంటున్నారని స్మృతి మండిపడ్డారు.

Rahul Gandhi
Rape in India
BJP
  • Loading...

More Telugu News