Telugu Movie 'Mathu Vadhaladhar' First song release: ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ సాంగ్ విడుదల

  • వినూత్నంగా ప్రమోషన్స్ చేపట్టిన చిత్ర బృందం
  • హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న శ్రీసింహా
  • క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘మత్తు వదలరా’ తొలి పాటను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సామాజిక మాధ్యమంగా విడుదల చేసింది. రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు. అందరూ కొత్త నటీనటులతో కూడిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ నేపథ్యంలో చిత్రం యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ ఆవరణలో ఓ యువకుడిని కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి మత్తు వదలరా అంటూ వినూత్నంగా బోర్డు పెట్టి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా హీరో శ్రీసింహా మాట్లాడుతూ..‘క్రిస్మస్ కానుకగా మత్తు వదలరా చిత్రం విడుదల చేస్తున్నాము. చిత్రం ప్రమోషన్స్ ప్రారంభించాము. ఇటీవల విడుదలచేసిన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాము’ అని అన్నారు.

Telugu Movie 'Mathu Vadhaladhar' First song release
  • Loading...

More Telugu News