nirbhaya: సుప్రీంకోర్టును ఆశ్రయించిన 'నిర్భయ' తల్లి

  • దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని వినతి
  • శిక్ష అమలులో ఆలస్యంపై పిటిషన్ వేస్తామని చెప్పిన న్యాయవాది
  • ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి 
  • ఈ నెల 17న విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' హత్యాచారం కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్‌ సింగ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. దీనిపై 'నిర్భయ' తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్షయ్ రివ్యూ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి కోరారు. శిక్ష అమలులో ఆలస్యంపై పిటిషన్ వేస్తామని నిర్భయ తల్లి తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17న ఈ పిటిషన్లను విచారించనుంది.

కాగా, అక్షయ్‌ పిటిషన్‌పై ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ఇప్పటికే తెలిపింది. తనకు వేసిన మరణశిక్ష తీర్పును పున:సమీక్షించాలని అక్షయ్‌ తన పిటిషన్‌లో కోరాడు. ఈ సందర్భంగా అతడు వింత వాదన చేశాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల ఎలాగో తన ఆయుష్షు తగ్గిపోతుందని అలాంటప్పుడు ఇంక మరణశిక్ష ఎందుకని ఆయన ప్రశ్నించాడు.

nirbhaya
New Delhi
Supreme Court
  • Loading...

More Telugu News