Buggana: చంద్రబాబునాయుడిపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం!

  • స్పీకర్ తమ్మినేనికి అధికారం ఇస్తూ తీర్మానం
  • తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బుగ్గన
  • బలపరిచిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్ ను దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని, ఆ అధికారం స్పీకర్ చేతికే ఇస్తున్నామని, సభాధ్యక్షుడు తన విచక్షణాధికారంతో ఆయనపై ఎటువంటి చర్య తీసుకోవాలో నిర్ణయించాలన్న తీర్మానాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా మద్దతు పలికారు.

అంతకుముందు జరిగిన ఘటనలపై చంద్రబాబు విచారం వ్యక్తం చేయాలని, తద్వారా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు అంగీకరించలేదు. ఆపై బుగ్గన చంద్రబాబుపై చర్యలకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ హుందాతనాన్ని కాపాడేందుకు, ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ, వారికి భరోసాను ఇచ్చేందుకు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు చర్యలు అనివార్యమని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు, అంబటి రాంబాబు, ఆర్. వరప్రసాద్ తదితరులు బలపరుస్తూ మాట్లాడారు. 

  • Loading...

More Telugu News